Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
- 2 వేల హోంగార్డుల నియామకంపై చర్చ
- కొత్త పోలీస్ మాన్యువల్ విడుదలకు సన్నాహాలు
- మహిళా పోలీసు అధికారుల సదస్సు
- క్రీడలు, శిక్షణకు ప్రత్యేక క్యాలెండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Guards Recruitment : తెలంగాణ పోలీస్ శాఖ భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, సిబ్బంది సంక్షేమం, క్రీడా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్ నిర్వహించడంపై సమీక్ష జరపగా, మహిళా పోలీసు అధికారుల సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్ విడుదలపైనా కీలకంగా సమాలోచనలు చేశారు.
హోంగార్డుల భర్తీ.. సిబ్బంది సంక్షేమంపై దృష్టి
రాష్ట్రంలో 2 వేల మంది హోంగార్డుల నియామకంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. త్వరలో విడుదల చేయనున్న హోంగార్డుల నియామకాల నోటిఫికేషన్ కు సంబంధించిన అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. పోలీస్ శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని సమీక్షించారు. మరోవైపు రిటైర్డ్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంపై కూడా చర్చించారు.
Also Read
- Hyderabad Water Supply: హైదరాబాద్కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
బ్యాండ్ల పునరుద్ధరణ.. క్రీడలు, శిక్షణ క్యాలెండర్
పోలీస్ శాఖకు సంబంధించిన బ్రాస్, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించాలని నిర్ణయించారు. రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణపై సమీక్షించడంతో పాటు, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు పోలీస్ శాఖకు వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపొందించడంపైనా దృష్టి సారించారు.
అధికారులకు బాధ్యతలు.. గడువులు నిర్దేశం
సమావేశంలో చర్చించిన ప్రతి అంశం, ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఆయా పనులకు నిర్దిష్ట గడువులు కేటాయించిన డీజీపీ సీవీ ఆనంద్.. నిర్ణీత సమయంలోగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
AP Elections: ఏపీ జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఎన్డీయే కూటమి జైత్రయాత్ర.. 28 స్థానాల్లో 27 కైవసం..
-
Supreme Court: కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. విజయ్ సర్కార్కు ఎదురుదెబ్బ..
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
-
Hyderabad Water Supply: హైదరాబాద్కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!