Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
- గోదావరి జలాల తరలింపునకు ఏర్పాట్లు
- రెండు రోజుల్లో పైప్‌లైన్ అనుసంధానం
- రాతి పొరలతో పనుల్లో జాప్యం
- రోజుకు 40 ఎంజీడీల అదనపు నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు జలమండలి ముమ్మరంగా చర్యలు చేపట్టింది. సింగూరు, మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి అదనపు జలాలను తరలించే పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ, జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి కలిసి ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.
రాతి పొరలతో జాప్యం.. ఘన్‌పూర్‌లో సిద్ధమైన జంక్షన్
ఈ పనులను తొలుత ఈ నెల 15 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అటవీ ప్రాంతంలోని 150 మీటర్ల పైప్‌లైన్ మార్గంలో భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు మిగిలిన పనులను వేగంగా చేపడుతున్నామని, రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఘన్పూర్ ఎంబీఆర్ వద్ద జలమండలి చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ అనుసంధానం కాగానే ట్రయల్ రన్ మొదలుపెట్టనున్నారు.
Also Read
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- Hyderabad: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కత్తితో బిల్డర్ హల్చల్.. బౌన్సర్లపై దాడికి యత్నం!!
సింగూరు–మంజీరా లోటు భర్తీకి ముందస్తు అడుగు
ఎల్‌నినో ప్రభావంతో సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో జలమండలి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. సింగూరు, మంజీరా నీటిపై ఆధారపడిన ప్రాంతాలకు ఎదురయ్యే లోటులో సుమారు 50 శాతాన్ని ఈ గోదావరి జలాలతో భర్తీ చేయనున్నారు. మిషన్ భగీరథ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక పనులను పూర్తి చేసి ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో తడబడ్డ భారత్..
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!