Seasonal Diseases: వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వార్డులు కిక్కిరిసిపోతున్నారు. కొద్దిరోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి, ఆ తర్వాత వర్షం ఆగింది. ఈ కారణంగా వాతావరణంలో మార్పులతో దోమలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read also: INDIA Alliance: మోడీపై సమిష్టిపోరుకు సమాయత్తం..నేడు “లోగో” ఆవిష్కరణ
మరోవైపు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జ్వరపీడితులతో కిక్కిరిసిపోయింది. ఆసుపత్రిలోని 500 పడకలు పూర్తిగా రోగులతో నిండిపోయాయి. రోగులు ఎక్కువగా రావడంతో జ్వరం తగ్గకముందే కొందరిని డిశ్చార్జి చేయాల్సి వస్తుంది. వందల సంఖ్యలో వైరల్ ఫీవర్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, ఇల్లందకుంట, మానకొండూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో డెంగ్యూ జ్వరాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎవరిని పలకరించినా ప్లేట్ లెట్స్ తగ్గాయని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, పరిశుభ్రత లోపించడంతో జ్వరాలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 40 మంది వచ్చేవారు.. ఇప్పుడు ఆ సంఖ్య 150కి చేరడంతో వాంతులు, విరేచనాల కేసులు పెరిగాయి. పడకలు సరిపోకపోతే అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంత మంది వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. డెంగ్యూ నిర్ధారణ అయిన ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపట్టి వ్యాప్తి చెందకుండా రక్తనమూన సేకరణ చేపట్టాలన్నారు.
Success Story: ఉద్యోగాన్ని వదిలి.. భూమిని నమ్మాడు.. రూ.కోటి సంపాదిస్తున్నాడు