SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SVC 63: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం SVC 63 పేరుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఘాట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని తగ్గించుకున్నారనే వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన నటించిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ఇప్పుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు ఈ కండలవీరుడు.
అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 6 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు ఆరు వారాల పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మరికొన్ని కీలక ఎపిసోడ్లను చిత్రీకరించనున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు ఆశించే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు ఈ సినిమా పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని చిత్రబృందం భావించింది. అయితే షెడ్యూల్ లో మార్పులు చేసి ఇప్పుడు ముంబైకి మకాం మార్చింది చిత్రబృందం. కొద్ది రోజుల్లో నయనతార కూడా షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తుండగా, నటుడు రాహుల్ దేవ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం నిర్మాతలు ఇప్పటికే ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ , కుల్దీప్ రాథోడ్ లు కలిసి ఈ ‘SVC 63’ ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘సికందర్’ తర్వాత దాదాపు రెండేళ్ల విరామంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. టాలీవుడ్లో ఫ్యామిలీ స్టోరీలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి, ఈసారి సల్మాన్ ఖాన్‌ను పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి వస్తున్న హైప్ తో టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!