తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని, శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్…