Robbery at home in Nizamabad
తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఆదర్శనగర్‌లో తాళం వేసిన ఇంటిని దొంగలు దోచుకున్నారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవహించి బీరువాలో దాచుకున్న 20 తులాల బంగారు నగలు అపహరించుకొని వెళ్ళారు. ఈ సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. ఆదర్శనగర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా డ్యూటీలో ఉండగా, అతని భార్య ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్ళింది. దీనిని గమనించిన దొంగలు ఇంట్లో చోరబడి బీరువాను ధ్వంసం చేసి అందులో దాచుకున్న 24తులాల బంగారం,3.5తులాల బంగారం, కొంత నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు మూడవ టౌన్ ఎస్ఐ సాయినాథ్ సమాచారం తెలిపారు.
Hyderabad Rains : భాగ్యనగరాన్ని వీడనంటున్న వరుణుడు..
ఇంటి యజమాని విధులు ముగించుకొని శనివారం ఉదయం ఇంటికి వెళ్లేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. మూడో టౌన్ ఎస్ఐ సాయినాథ్, భాస్కరా చారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని దొంగల వేలిముద్రలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. సీసీటీవీ కెమెరా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. చోరికి పాల్పడిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.