Kavitha: గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జాగృతి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి తుమ్మల వల్లే ముంపు ముప్పు ఉందని తెలిపారు. మొక్క రైతులకు బోనస్ చెల్లించి, కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలన్నారు.
Nizamabad: నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తెల్లవారు జామున రియాజ్ బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. గత 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా, కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేసి పరారైన విషయం తెలిసిందే. 48 గంటల్లోనే సారంగాపూర్ వద్ద పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. అయితే, అరెస్ట్ సమయంలో…
MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను…
ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు.
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని…
MLC Kavitha : నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు…
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.
BIG Breking: నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈ.ఓ.వేణు సరస్సులో దిగి స్నానం చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది.
డి.శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కాంగ్రెస్ లోకి చేరునున్నారు. దీనిపై ఆయన తండి డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇవాల ఆదివారంనాడు గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టనున్నారు.