విచారణ ముసుగులో గాంధీ కుటుంబం కి నోటీసులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అబద్దాల పునాదుల మీద అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కావాలనే గాంధీకుటుంబాన్నిఅవమానించాలని చూస్తుంది. అందుకే మూత పడిన కేసును..మళ్లీ విచారణ కి తేవడం బీజేపీ కుట్రలో భాగమే అని రేవంత్ మండిపడ్డారు.
అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక మూయించాలని మోడీ కుట్ర చేశారని,13 న రాహుల్ గాంధీ..23 న సోనియా గాంధీ ED ముందు హాజరు అవుతారు. అక్రమంగా..అన్యాయంగా రాహుల్ గాంధీని ED విచారణకు పిలిచారు. ఇందులో పైశాచిక ఆనందం పొందుతున్న అమిత్ షా..మోడీ కుట్రలను త్వరలోనే ఛేదిస్తామని రేవంత్ తెలిపారు. ఇందులో భాగంగానే శాంతియుత నిరసన చేపట్టి ED ఆఫీస్ వరకు పాదయాత్ర గా వెళ్తాం. నెక్లెస్ రోడ్ నుండి ED కార్యాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ చేపడుతాం అని ,ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కార్యకర్తలు తరలి రండి అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
ఇక తెలంగాణ కు..సోనియా గాంధీకి పేగు బంధం ఉందని, హైదరాబాద్ లో మైనర్ లపై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. MIM, TRS,BJP కలిసి సమస్యను పక్కదారి పట్టించే పని చేస్తున్నారు. గడిచిన వారంలో 15 మందిపై అత్యాచారాలు జరిగాయి. ప్రభుత్వమే నేరాల కు పాల్పడుతున్నది. ప్రభుత్వ పెద్దల పిల్లలే అత్యాచారం లో ఉన్నారు. అసద్ దేశం లో ఎక్కడ ఏం జరిగిన స్పందిస్తారు. మరి అత్యాచారాలపై ఎందుకు స్పందించరు. అత్యాచారాల పై కెసిఆర్ ఎందుకు స్పందించరు. అత్యాచారాలు చేసేవాళ్ల కండ్లు పికుత అన్నావు కదా ..మరి MIM నాయకుల పిల్లలు అత్యాచారం చేస్తే కనీసం స్పందించవా..? కొత్త పార్టీ మీద చర్చ చేస్తున్నారు కానీ… అత్యాచారాల పై మాత్రం స్పందించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
ఇక ఈ నెల 15న హైదరాబాద్ బచావో నినాదంతో నగరంలోని శాంతి భద్రతలపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రచ్చ బండ కార్యక్రమం జూలై 7 వరకు పొడగిస్తున్నట్టు తెలిపిన రేవంత్ ..కేసీఆర్ వ్యవహారం అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందంలా ఉంది. అందులో బ్రహ్మానందం రేడియేటర్ సినిమాలా ఉంది కేసీఆర్ పరిస్థితి. కేసీఆర్ కూడా అనుకోకుండా తెలంగాణ కు సీఎం అయ్యారు అని, కొంత కాలానికి ప్రజలే టీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారు. గజ్వేల్ ఫాంహౌసే కేసీఆర్ కు ప్రపంచం అవుతోంది అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
.
త్వరలోనే TRS ను BRS చేస్తా అన్నాడు. కానీ ప్రజలు VRS ఇస్తారు అని అన్నారు. కాంగ్రెస్ లేదన్నప్పుడు..కాంగ్రెస్ కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారు. పొత్తు పెట్టుకుంటా అని ఎందుకు తిరుగుతున్నారు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యే లు 100 మంది..అందులో సగం లంగలే..TRS పేరుతో దేశం అంతా పోటీ చేయొచ్చు కదా..? మరి BRS ఎందుకు? TRS మీద బ్యాన్ ఉందా..? లేక TRS దుకాణం దివాలా తీసింది కాబట్టి BRS పెట్టిండా..?చివరికి కెసిఆర్..ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్తారు.. అని విమర్శించారు రేవంత్.
ఇప్పటికే కెసిఆర్ ఎన్నో కథలు చెప్పారు. అన్నీ ప్రాంతాలు తిరిగి వచ్చి..ఇప్పుడు మళ్లీ కథలు చెప్పిండు.NTR నీ తిట్టింది ఆయనే… మళ్లీ ఇప్పుడేమో మోస్తున్నారు.. కెసిఆర్ మాటలు చిత్తు కాగితం తో సమానం. ఇక కెసిఆర్ నీ ఇంటికి పంపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. తెలంగాణలో కెసిఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఇక్కడ ఆయన కాలం చెల్లిపోయింది. కాలం చెల్లిన మెడిసిన్ వాడితే ఎలా రియాక్షన్ వస్తుందో..కెసిఆర్ తో కూడా అంతే. కెసిఆర్ నీ జాతీయ రాజకీయాల్లో..జోకర్ లెక్క చూస్తున్నారు. నెల్లూరు లో ఉప ఎన్నిక ఉంది. జాతీయ రాజకీయాల్లో మక్కువ కెసిఆర్ కి ఉంటే..నెల్లూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి..