Mother Sold Son : కొడుకును అమ్మేసి.. కిడ్నాప్ చేశారంటూ డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి అనే పదానికి మచ్చ తీసుకువచ్చిందో మహిళ.. కన్న కొడుకు డబ్బుల కోసం అమ్మేసి.. పైగా కిడ్నాప్ చేశారంటూ డ్రామాకు తేరలేపింది. ఈ నెల2 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లాలో కంది గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన వడ్డె శ్రీలత (32) తన భర్తకు దూరంగా తన మూడేళ్ల కొడుకుతో కలిసి ఉంటోంది. అయితే.. శ్రీలత ఈ నెల 1వ తేదీన తన మూడేళ్ల కొడుకును రోడ్డుపై కొడుతూ కనిపించింది. అయితే.. అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే సమయంలో అటుగా వెళ్తున్న చెందిన హసన్ అనే మెకానిక్.. బాలుడిని ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించగా, నా కొడుకు..నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలత. దీనికి.. నీకు ఇష్టం లేకుంటే ఎవరికైనా ఇచ్చేయ్.. అందుకు డబ్బులు ఇస్తారంటూ మెకానిక్ హసన్ వెల్లడించడంతో.. కొడుకును విక్రయించ డానికి సిద్ధమైంది శ్రీలత.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 2న జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద హైదరాబాద్ కు చెందిన మెకానిక్ హసన్ అతడి భార్య సనాబేగంలకు కొడుకును 30వేలకు శ్రీలత విక్రయించింది. ఈ వ్యవహారాన్నంతా మెకానిక్ హసన్ తన సెల్‌ఫోన్ వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఓ మెకానిక్ తనను కత్తితో బెదిరించి తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులకు శ్రీలత ఫిర్యాదు చేసింది. దీంతో.. రంగంలోకి దిగిన సంగారెడ్డి రూరల్ పోలీసులు.. బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ లో బాలుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వెంటనే మెకానిక్ దంపతులతో పాటు బాలుడిని శనివారం సంగారెడ్డికి తీసుకువచ్చారు. వడ్డె శ్రీలతను బెదిరించడం, బాలుడిని కిడ్నాప్ చేయడం అవాస్తవమని పోలీసుల నిర్దారణ వచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు శ్రీలతపై, బాలుడిని కొనుగోలు చేసినందుకు మెకానిక్ దంపతులు హసన్-సనాబేగంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని సంగారెడ్డిలోని శిశుగృహకి తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!