Revanth Reddy: కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఆరెండు పార్టీలు కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీతో చిట్ చాట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని అన్నారు. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు? అంటూ రేవంత్ మండిపడ్డారు. కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీల కుట్రఅని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని ఆరోపించారు. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: MLC Kavitha Letter to CBI: సీబీఐకి ఎమ్మెల్యే కవిత మరో లేఖ.. ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. 6న కలవలేను..!
Also Read
పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆర్ఎస్కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని, నాలుగేళ్ళ కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని పిలుపు నిచ్చారు. కొడంగల్ కు అభివృద్ధికి నిధులు వచ్చుడో శాసన సభ్యుడు సచ్చుడో తేలాలని ఆయన వ్యాక్యానించారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలని అన్నారు. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి… టీఆర్ఎస్ తీరును ఉతికి ఆరేస్తామని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Fake Baba Case: అమ్మాయిల ఫిజిక్ ని బట్టి రేటు.. వ్యభిచార ముఠాకు నగ్న ఫోటోలు
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!