MLC Kavitha Letter to CBI: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ.. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న కలవలేను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం సీఆర్‌పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన కలవాలని సూచించారు. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్‌ఏ రాసిన లేఖ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా తనకు వీలైనంత త్వరగా తనకు పంపాలన్నారు.. అయితే, దీంతో, ఈమెయిల్ ద్వారా ఆమెకు రిప్లై ఇచ్చిన సీబీఐ.. వెబ్‌సైట్‌లో ఉంచామని తెలపవడంతో.. ఇవాళ మరోలేఖను సీబీఐకి రాశారు కవిత.. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు.. సీబీఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేదంటూ తాజా లేఖలో పేర్కొన్నారు కవిత.
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
- Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత రాసిన తాజా లేఖ విషయానికి వస్తే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను అని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు.. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందిస్తూ సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ, అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత ఇవాళ ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఇక, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని పునరుద్ఘాటించారు ఎమ్మెల్సీ కవిత… దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!