కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న రాజకీయ విషప్రచారంలో ఈటెల కూడా పాత్ర ధారి అన్నారు.