Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home News Pawan Kalyan Sensational Commentsy Over Kapu Reservation

Pawan Kalyan: నేను మెత్తగా కన్పిస్తానేమో, కానీ మెత్తటి మనిషిని కాను.. పవన్ వార్నింగ్

Published Date :March 12, 2023 , 8:01 pm
By Abdul khadar
Pawan Kalyan: నేను మెత్తగా కన్పిస్తానేమో, కానీ మెత్తటి మనిషిని కాను.. పవన్ వార్నింగ్
  • Follow Us :

Pawan Kalyan Sensational Commentsy Over Kapu Reservation: తాను మెత్తగా కన్పిస్తానేమో కానీ.. మెత్తటి మనిషిని కానంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరావతి కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశమైన పవన్.. సంఖ్యాబలం ఎక్కువ ఉప్పటికీ, అధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపు కులం ఉందన్నారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ కోసం అడుక్కోవడం దేనికని ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని సూచించారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగపడడం లేదని ధ్వజమెత్తారు. కాపులు అధికారంలోకి వస్తే.. మిగిలిన కులాలను తొక్కేస్తారనే దుష్ప్రచారంతో నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. కాపులు పెద్దన్న పాత్ర వహించాలని, అప్పుడు ఊళ్లో ఏ కష్టం వచ్చినా కాపుల దగ్గరకే వస్తారని అన్నారు. ఇది అలవర్చుకుంటే అధికారం మీ దగ్గరకు వస్తుందని తెలిపారు.

Rajinikanth: రాజకీయాల నుంచి అందుకే తప్పుకున్నా.. రజినీకాంత్ క్లారిటీ

సమాజంలో విడదీసే మనుషులే ఎక్కువగా ఉన్నారని, కలిపేవాళ్లు చాలా తక్కువ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2009లో జరిగిన ఘటనలు తనలో పంతం పెంచాయని, సంఖ్యా బలం ఎక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని చాలా మంది అన్నారని గుర్తు చేసుకున్నారు. అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదన్నారు. దీని కోసం ఒక్కడు అన్ని అవమానాలు భరించాలి, త్యాగాలు చేయాలన్న ఆయన.. దీనికి తానను కంకణం కట్టుకుని ఉన్నానన్నారు. తన తల్లి గాజుల బలిజ అని, తండ్రి కాపు అని తెలిపిన పవన్.. తానెంత వాస్తవమో, తన కులం కూడా అంతే వాస్తవమన్నారు. తాను కాపు కులంలో పుట్టొచ్చు కానీ.. తన మనస్సు మాత్రం అట్టడుగున ఉన్న రెల్లి కులం వైపే ఉంటుందన్నారు. తాను కాపు నేతను కానేమో కానీ.. కాపుల సమస్యలను, ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న వాడినని చెప్పారు. కాపులు పార్టీ నడపలేరనే విమర్శలు చేసే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలన్నారు. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం ఉండదని.. దీన్ని తాను ఎదుర్కుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Margani Bharath Ram: అతడో అరిటాకు, సర్కస్‌లో బఫూన్.. ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు

తానెప్పుడూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని.. కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే ఒప్పందాలు ఉంటాయని పవన్ తెలిపారు. అవమానపడి, గింజుకునే స్థాయిలో ఒప్పందాలు ఉండవని స్పష్టం చేశారు. జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించమని హామీ ఇచ్చారు. తాము ఏ పార్టీ అజెండాను మోయమన్న ఆయన.. వేయి కోట్లు ఆఫర్ అని ఒకరంటారని, వేయి కోట్లతో పార్టీని నడపగలమా? అని ప్రశ్నించారు. సంకల్పం లేకుంటే.. రూ. 10 వేల కోట్లున్నా పార్టీని నడపలేమన్నారు. సీఎం కుటుంబం దగ్గరున్న మైన్స్ బలిజలకు చెందినవేనని, కానీ పోటీ తట్టుకోలేక వెనుకపడ్డారని అన్నారు. కోస్తాలో కాపులు గొంతెత్తగలరు.. కానీ సీమలో బలిజలు గొంతెత్తే పరిస్థితి లేదన్నారు. నువ్వెంత ఎదిగినా సరే.. నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్‌ది అని ఆరోపించారు. మనతో ఉన్న వాళ్లే మనల్ని వెన్నుపోటు పొడుస్తారని, తాను ఓడిపోతే మీసాలు మేలేసి తొడగొట్టింది కాపులేనని, అసలు తాను ఓడిపోతే మీకేంటి ఆనందమని పవన్ నిలదీశారు.

Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

తనని బీసీ, ఎస్సీ, కాపులతో తిట్టిస్తారని.. కానీ మిగిలిన వాళ్లు ఎందుకు తిట్టరని పవన్ ప్రశ్నించారు. వాళ్లు మంచి వాళ్లుగా ఉండాలి, మనలో మనం కొట్టుకోవాలన్నదే వారి వ్యూహమని వివరించారు. దీన్ని గుర్తించినంత వరకు రాజ్యాధికారం దక్కదన్నారు. కాపులు, బీసీలు సంఘాలుగా విడిపోయాయన్న ఆయన.. కాపులు పెద్దన్న పాత్ర పోషించి బీసీ, ఎస్సీలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. రెడ్డి, కమ్మ వర్గాలతో గొడవలు పెట్టుకోకూడదని.. అగ్ర వర్ణాలను గౌరవించడమంటే లొంగిపోయినట్టు కాదని వివరించారు. తానింకా ప్రతికూల పవనాల్లోనే పార్టీని నడుపుతున్నానని.. అనుకూల పవనాలు రాలేదని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట పోటీ చేయండని సూచిస్తున్నారని.. గాజువాక, పీఠాపురం, భీమవరం సెగ్మెంట్లల్లో పోటీ చేయమని చెప్తున్నారన్నారు. కాపులంతా ఓట్లేస్తే.. గతంలో పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచేవాడినన్నారు. తన అభిమానులు కూడా రాజకీయం వచ్చేసరికి ఓటు వేయలేదని.. ఇది వాస్తవమని.. దీన్ని అంగీకరించాల్సిందేనని పవన్ అన్నారు.

Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు

తాను తలచుకుంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలనని.. కానీ తనకు పేదల సేవలోనే తృప్తి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మా కులపోడే అంటూ తనని తిడుతున్నారని.. తనని విమర్శించండి కానీ కులాన్ని కించపరచొద్దని అన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న ఆయన.. కాపులు కొద్దిగా మెత్తగా మాట్లాడమని కోరారు. ఇప్పుడొచ్చి మా కులం అంటున్నారని, కానీ ఎన్నికల్లో వేరే వారికి ఓటేస్తారని మండిపడ్డారు. ఓటుకు డబ్బు తీసుకోకూడదని.. ఒకవేళ డబ్బులు తీసుకోకుండా ఉండలేకపోతే, అక్కడ తీసుకొని గ్లాసు గుర్తుకు ఓటు వేయండని, వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని కోరారు. తనకు కాపులు అక్కర్లేదని చెప్పిన జగన్‌కి ఓటేశారని.. నా ఆత్మ గౌరవాన్ని ప్రశ్నిస్తున్న మీరు, మీ ఆత్మ గౌరవం గురించి ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. గతంలో తునిలో కాపు రిజర్వేషన్లు డిమాండ్ వారు.. ఇప్పుడెందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు.

  • Tags
  • janasena
  • kapu reservation
  • pawan kalyan
  • pawan kalyan speech
  • YS Jagan Mohan Reddy

WEB STORIES

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

"పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!"

Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

"Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?"

Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు

"Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు"

Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి

"Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి.. డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టండి"

Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

"Curd Rice: పెరుగన్నం తింటే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!"

ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి..

"ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి.."

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

RELATED ARTICLES

Kotamreddy Sridhar Reddy: సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా.. ఆ ముగ్గురి గురించి జగనే చెప్పాలి

PKSDT: పవర్ స్టార్ – సుప్రీమ్ హీరో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Suman: పవన్ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : అమరవీరులకు అంజలి

Janasena and BJP Alliance: జనసేన-బీజేపీ పొత్తు… సోము వీర్రాజు హాట్‌ కామెంట్లు..!

తాజావార్తలు

  • Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..

  • Viral: ఓ తాతో నువ్వు ఈ వయసులోనే ఇలా ఉంటే.. మరి ఆ వయసులో..

  • S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..

  • Top Headlines @9AM: టాప్ న్యూస్

  • MS Dhoni : బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మిస్టర్ కూల్.. ఈసారి కప్పు ముఖ్యం బిగిలు

ట్రెండింగ్‌

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

  • Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

  • Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions