Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- రిటైర్డ్ IPS అధికారి ఇంట్లో దారుణ హత్య
- పనిమనిషే మాస్టర్ ప్లాన్.. నేపాలీ గ్యాంగ్‌పై అనుమానం
- నగదు, బంగారం దోచుకుని పరారైన నిందితులు
- సీసీటీవీ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి సునందను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తే ఈ ఘాతుకానికి స్కెచ్ వేయడం ఇప్పుడు నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ హత్య వెనుక ‘నేపాలీ గ్యాంగ్’ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో గత ఎనిమిది నెలలుగా నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళ పనిమనిషిగా ఉంటోంది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టిన కల్పన, తన ముఠా సభ్యులకు సమాచారం అందించింది. పక్కా ప్రణాళికతో కల్పనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి సునందను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు ముందు కల్పనను కలిసేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు.
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
సునందను హత్య చేసిన అనంతరం నిందితులు ఇంట్లోని విలువైన వస్తువులపై పడ్డారు. అల్మారాల్లో ఉన్న భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని నిందితులు పరారయ్యారు. హత్య జరిగిన సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో భార్య ఒక్కరే ఉండటం, వారిపై నమ్మకంతో పనిమనిషిని పెట్టుకోవడం చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఘటన జరిగిన వెంటనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు , పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా బాధితుల ఇంటికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన కల్పన , ఆమె ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు నలుగురు కలిసి నగరం దాటి పారిపోయే అవకాశం ఉన్నందున సరిహద్దుల వద్ద నిఘా పెంచారు. రిటైర్డ్ ఐపీఎస్ ఇంటి నుంచి సేకరించిన కీలక ఆధారాలను, వీడియోలను ఉన్నతాధికారులకు చేరవేసి దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలోనూ నగరంలో ఇలాంటి నేపాలీ ముఠాలు దోపిడీలు, హత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, పనిమనుషులను పెట్టుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని సరిచూసుకోవాలని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్
-
Kareena-Nayanthara: నయనతార యాక్టింగ్ పై.. కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
-
CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!