Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- సువెందు అధికారి పీఏ దారుణ హత్య
- కాల్చి చంపిన దుండగులు
- రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్‌లో రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి, నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో, సీనియర్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అయిన చంద్రనాథ్ రథ్‌ను దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రథ్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం, దోహరియా ప్రాంతంలో లైసెన్స్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు చంద్రనాథ్ కారును వెంబడించారు.
దుండగులు, వాహనాన్ని చుట్టుముట్టి అతి సమీపం నుంచి పలు దఫాలుగా కాల్పులు జరిపారు. రథ్‌కు ఐదు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు రథ్ మరణించినట్లు ప్రకటించారు. తూర్పు మేదినీపూర్‌కు చెందిన చంద్రనాథ్ రథ్, బీజేపీ వ్యూహాత్మక వర్గాలలో సుపరిచితమైన వ్యక్తి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి బృందంలో ఆయన అత్యంత ప్రముఖులలో ఒకరు.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ఈ హత్య బెంగాల్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. బీజేపీ దీనిని ‘రాజకీయ హత్య’గా అభివర్ణించి, శాంతిభద్రతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. బెంగాల్‌లోని మధ్యమ్‌గ్రామ్‌లో తన పీఏ చంద్రనాథ్ రథ్ హత్యకు సంబంధించి, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసి, రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని అన్నారు.
ఆసుపత్రి బయట విలేకరులతో మాట్లాడుతూ సువెందు అధికారి ఇలా అన్నారు, ” ఇది పథకం ప్రకారం జరిగిన హత్య, డీజీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రెండు మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు, ఈ హత్య పక్కా ప్రణాళికతో జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము తీవ్ర దుఃఖంలో ఉన్నాము, ఈ ఘటనను ఖండించడానికి మాటలు రావడం లేదని బరువెక్కిన హృదయంతో తెలిపారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!