Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతున్న రైతులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరణించిన నక్కలపల్లి రాములు, దామరగిద్ధ కృష్ణ, శ్యామల సుజాత, జమీల్ అనే నలుగురు మృదేహాలకు చేవెళ్ల టౌన్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నారు.