Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
“నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోరక్షణ కోసం కృషి చేశాను,” అంటూ తన విధేయతను గుర్తు చేశారు.
Visakhapatnam: రైలును తలపించే క్యాప్సుల్ హోటల్.. ఎక్కడో కాదు మన విశాఖ రైల్వే స్టేషన్‌లోనే…
అయితే, పార్టీ కార్యకర్తల మనోవేదనను ఢిల్లీ నాయకులకు వివరించలేకపోయానన్న ఆవేదన వ్యక్తం చేశారు. “లక్షలాది కార్యకర్తల గొంతును బీజేపీ కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. ఇది నాకు బాధగా మిగిలింది,” అని వ్యాఖ్యానించారు.
రాజీనామా అనంతరం కూడా తన పోరాటం కొనసాగుతుందన్న రాజాసింగ్, “లవ్ జిహాద్ వ్యతిరేకంగా, గోరక్షణ కోసం, హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి ఇకపై మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాను. పదవులు లేకపోయినప్పటికీ దేశద్రోహులపై పోరాడాను. ఇప్పుడు ఉన్నా, ఎప్పుడూ ఈ పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
బీజేపీలో ఉన్న హిందుత్వవాదులు, ధర్మకర్తలు భయపడవద్దని, నిరాశ చెందవద్దని సూచిస్తూ, తనపై ఇప్పటివరకు చూపిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా తాను అదే ధర్మ మార్గంలో కొనసాగుతానని రాజాసింగ్ హామీ ఇచ్చారు.
