Bandi Sanjay : గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్లేనని, ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్లేనని చెప్పారు. ఇది సైన్స్ అంగీకరించిన వాస్తవాలని తెలిపారు. ఇస్లాంలోనూ కొందరు మతపెద్దలు గోవును పక్కన పెట్టుకుని నమాజ్ చేసిన ద్రుశ్యాలను తాను చూశానని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని నారాయణగూడ కేఎంఐటీ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ గో సేవా విభాగం ఆధ్వర్యంలో…
PM Modi: వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ‘‘జంతు ప్రేమికుల’’ నుంచి పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ ‘‘యానివల్ లవర్స్’’పై సెటైర్లు వేశారు. కేవలం ఒకే లైన్‌తో వారి కపటత్వాన్ని ఎత్తిచూపారు. శుక్రవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. జంతుప్రేమికులతో ఇటీవల తన సమావేశం గురించి వ్యాఖ్యానించారు.
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం…
డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. బక్రీద్ 2025 సందర్భంగా పోలీసులు ఎన్ని ఆవులను రక్షించారు..? అని ప్రశ్నించారు. జంతువుల రవాణా, వధకు ఎన్ని పశువైద్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు? రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవధను ఆపడానికి ఎలాంటి దీర్ఘకాలిక చర్యలు అమలు చేయబడుతున్నాయి? అని అడిగారు.
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.