MLA Raja Singh: తనను టార్గెట్ చేస్తూ బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.. తాను బీజేపీకి రాజీనామా జరగడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు.. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని అడిగారు. తాను బీజేపీ కార్యకర్తల కోసం మాట్లాడానన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు.
Goshamahal MLA Raja Singh Said I will not join any party: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను అస్సలు వెళ్లను తెలపారు. తాను ఏ పార్టీలో చేరను అని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని, ఎమ్మెల్యే పదవికీ బీజేపీ రాజీనామా చేయ్యమంటే చేస్తాను అని చెప్పారు. గోషామహల్‌లో ఉప ఎన్నిక వస్తే…
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం…
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ గారపాటి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ అధిష్ఠానం ఆయన పేరును అధికారికంగా ఖరారు చేసింది. అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒక్కటే నామినేషన్ రావడంతో, రామచంద్రరావు ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. Thammudu : ‘తమ్ముడు’…
Raja Singh:బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని తెలిపింది. ఆ సమయంలో విషయమై జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ చర్చించారు. ఇక రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని…
గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాజాసింగ్ హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. హిందుత్వ భావజాలం కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా ఉంది. అందేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.