Raja Singh : గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన.. హిందుత్వ కోసం పోరాటం కొనసాగుతుంది
- ఢిల్లీ నేతల నిర్లక్ష్యంపై రాజాసింగ్ ఆవేదన
- హిందుత్వ, గోరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం
- పదవులు లేకపోయినా దేశద్రోహులపై పోరాటం ఆగదు : రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
“నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం కోసం, గోరక్షణ కోసం కృషి చేశాను,” అంటూ తన విధేయతను గుర్తు చేశారు.
Also Read
Visakhapatnam: రైలును తలపించే క్యాప్సుల్ హోటల్.. ఎక్కడో కాదు మన విశాఖ రైల్వే స్టేషన్లోనే…
అయితే, పార్టీ కార్యకర్తల మనోవేదనను ఢిల్లీ నాయకులకు వివరించలేకపోయానన్న ఆవేదన వ్యక్తం చేశారు. “లక్షలాది కార్యకర్తల గొంతును బీజేపీ కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లలేకపోయాను. ఇది నాకు బాధగా మిగిలింది,” అని వ్యాఖ్యానించారు.
రాజీనామా అనంతరం కూడా తన పోరాటం కొనసాగుతుందన్న రాజాసింగ్, “లవ్ జిహాద్ వ్యతిరేకంగా, గోరక్షణ కోసం, హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి ఇకపై మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాను. పదవులు లేకపోయినప్పటికీ దేశద్రోహులపై పోరాడాను. ఇప్పుడు ఉన్నా, ఎప్పుడూ ఈ పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
బీజేపీలో ఉన్న హిందుత్వవాదులు, ధర్మకర్తలు భయపడవద్దని, నిరాశ చెందవద్దని సూచిస్తూ, తనపై ఇప్పటివరకు చూపిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై కూడా తాను అదే ధర్మ మార్గంలో కొనసాగుతానని రాజాసింగ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!