Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం…