తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందు వాహినిలో చేరి యువతను ధర్మం వైపునకు వచ్చేలా చర్యలు కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు.
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం…