OG : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ది మోస్ట్ వెయిటెడ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చప్పుడు లేకుండా సైలెంట్ గా అనౌన్స్ చేసేశారు. అందరూ అనుకున్నట్టే సెప్టెంబర్ 25 2025న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమా ఇది. మొన్నటిదాకా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ రిలీజ్ డేట్ లోపు కంప్లీట్ చేసుకుని ప్రమోషన్లు భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతోంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, సాంగ్స్ హైప్ ను పెంచేశాయి.
Read Also : Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..
ఇక రిలీజ్ డేట్ గురించి ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. అఖండ-2 రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ 25నే ఈ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే బాలయ్య మూవీతో పోటీ తప్పదన్నమాట. రెండు భారీ అంచనాలున్న సినిమాలే. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడి చాలా ఏళ్లు అవుతోంది. ఈ సారి సెప్టెంబర్ లో భారీ ఫ్యాన్ వార్ తప్పేలా కనిపించట్లేదు. కానీ దేని సత్తా దానిదే. ఓజీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పవన్ ను ఫుల్ లెంగ్త్ మాస్ యాంగిల్ లో చూడాలన్నది ఆయన అభిమానుల ఆశ. సుజీత్ చాలా పదును పెట్టిన తర్వాత ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడని తెలుస్తోంది. మరి సెప్టెంబర్ 25న ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.
Read Also : Chaitra Rai : మరోసారి తల్లి కాబోతున్న ‘ఎన్టీఆర్’ బ్యూటీ..
We are ready….⁰You better get your ⚰️⚰️⚰️⚰️ ready too….#OG #TheyCallHimOG #OGonSept25 pic.twitter.com/cPQJMDrZxR
— DVV Entertainment (@DVVMovies) July 11, 2025