నిన్న ఏర్పడిన అల్పపీడనం.. ఈ రోజు వాయువ్య బంగళా ఖాతం &పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనము వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్ఘడ్, విధర్బా, ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదగా అరేబియా సముద్రం వరకు 3.1 నుండి 5.8 కిమి ఎత్తు వరకు ఏర్పడింది. దీంతో తెలంగాణాలో అన్ని జిల్లాలలో రాగల 3 రోజుల పాటు (12,13,14వ.తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మి వేగంతో)కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారులను అలర్ట్ అయింది.