Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చాలా చోట్ల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు