Bhatti Vikramarka: టీఆర్ఎస్ కు భజన చేసే వారికే పబ్ ల అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ కు భజన చేసే వారికి పబ్ ల అనుమతి ఇస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సి.బి.ఐ విచారణకు అనుమతించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్ లలోకి మైనర్లకు అనుమతి లేదు..మరి ఎలా అనుమతి చేశారు? అని ప్రశ్నించారు. మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు ఉల్లంఘించారని ఆయన నిలదీశారు.
పబ్ లకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ,హోంమంత్రిని హెచ్చరిస్తున్నానని, డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ మారుతుంటే మీరేం చేస్తున్నారని భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ప్రశ్నించారు. హోం మంత్రి తన విధిని సక్రమంగా నిర్వర్తించడు. నిర్వర్తించమని అడిగితే కలవకుండా అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. అత్యాచారం ఘటనపై దోషులను శిక్షించాలని హోంమంత్రి ,డీజీపీ ని కలవడానికి వెళ్లిన మా మహిళ కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
Also Read
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
తెలంగాణ తెచ్చుకున్నది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్, మద్యం మత్తులో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న నియంత్రిం చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నదని భట్టి విక్రమార్క ఎద్దేవ చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేయడానికి ఎందుకు తాత్సర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు హోంమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతోందని, నిందితులు రాజకీయ పలుకుబడి ఎంత ఉన్న వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!