Priyanka Gandhi: ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు.. ఇటువంటి అవినీతి సర్కార్ మనకి అవసరమా..? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకి ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఎగ్జామ్ లు పెడతారు.. పేపర్లు లీక్ చేస్తారు అని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడుతుంది బీఆర్ఎస్ అని అన్నారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
Read also: Rashmika: గర్ల్ ఫ్రెండ్ గా మారిన నేషనల్ క్రష్…
ఇటువంటి అవినీతి సర్కార్ మనకి అవసరమా..? తెలంగాణలో కేసీఆర్ కి బై బై చెప్పండి అని పిలుపునిచ్చారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మేం అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ధనంతుల పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదేళ్ళలో అవినీతికి పాల్పడి డబ్బంతా సంపాదించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఆదాని, అంబానీలకి బీజేపీ కొమ్ముకాస్తుందన్నారు.
CPI Narayana: బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళు నిద్రపోయారా..? ఎన్నికలు అయ్యాక కవితను అరెస్ట్ చేస్తారా!