Deputy Manager: డిప్యూటీ మేనేజర్ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు. వేలల్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మేనేజర్ కొట్టేసింది సుమారు రూ.8.5 కోట్లు. దొంగిలించిన ఖాతాదారుల సొమ్మును ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు ఉపయోగించాడు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో ఈవార్త కాస్త సంచలనంగా మారింది.
Read also: Hyderabad: జహీరాబాద్‌లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. దీంతో బ్యాంకు నుంచి ఖాతాదారుల సొమ్మును వాడుకోవడం ప్రారంభించాడు. బ్యాంకులో బంగారం నిల్వ చేసి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకుని బంగారం ఇచ్చాడు. కొంత డబ్బు చెల్లించి ఖాతాను రెన్యూవల్ చేయించుకుని నకిలీ లావాదేవీలు జరిపాడు. కొన్నిసార్లు బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అదే బంగారాన్ని బినామీ పేరుతో తన బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. ఆ డబ్బుతో ఆన్లైన్లో బెట్టింగ్‌లు ప్రారంభించాడు. అక్కడక్కడా ఖాతాదారులను, బ్యాంకును మోసం చేస్తున్నాడు.
కొన్నిసార్లు కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 128 మంది ఖాతాల నుంచి రూ.8.65 కోట్లు వాడినట్లు బ్యాంకు ఆడిటింగ్‌లో తేలింది. ఈ తతం గత నెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఖాతాదారుల డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలి? ఖాతాదారులకు తెలియకుండా బంగారం చోరీకి గురైనందున ఖాతాదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!