ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు…