Niranjan Reddy: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని మంత్రి తుమ్మలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పరిస్థితి చూస్తే ఏడుపు వస్తుందన్నారు. రైతులు పంటలు కాలుస్తుంటే దుఃఖం అవుతుందని తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల మాట్లాడడం దుర్మార్గమన్నారు. రైతుల గురించి తుమ్మల ఎందుకు అలా మాట్లాడు తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ముందు చూపు లేకపోవడం వల్లే ఈ కరువు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు.
Read also: kendriya vidyalaya: కేవీల్లో ప్రవేశాలకు మొదలైన దరఖాస్తులు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే..?!
రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతలు మాట్లాడకుండా.. మొత్తం చర్చను రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో 15000 రైతు బాదు, 500 రూపాయల బోనస్ ఇస్తాం.. ఏమైంది? రైతు కుటుంబం నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు రైతుల గురించి తెలుసుకుని వారి గురించి మాట్లాడుతున్నారు. యాసంగి పంటలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని హరీశ్‌రావుతో కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ ను పదే పదే తిట్టిపోస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
Read also: Arvind Kejriwal: తిహార్ జైలుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్
తీవ్ర కరువు ఉన్నప్పటికీ తెలంగాణకు నీరందించి, సస్యశ్యామలం చేసి, ప్రశాంతంగా తీర్చిదిద్దింది బీఆర్ ఎస్ కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీ, 500 బోనస్ ఇచ్చి గత వ్యవసాయ శాఖ మంత్రి కంటే మంచి పేరు సంపాదించుకోవద్దని తుమ్మలకు సూచించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని, అది ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు. తుది శ్వాస విడిచిన వారెవరో ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
Read also: Tillu squre: 100 కోట్ల లక్ష్యంతో దూసుకుపోతున్న టిల్లు.. 3 రోజులకు ఏకంగా..?!
ఇక మరోవైపు ఆదిలాబాద్ జైనాథ్ మండలంలోని కాప్రి, ఉమ్రి, కరింజి గ్రామాలలో రైతులు నష్ట పోయిన మిర్చి, జొన్న పంటలను రైతులతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. అదిలాబాద్ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ సమావేశాలు, జాయినింగ్ కార్యక్రమాలు తప్ప రైతులపై దృష్టి సారించ కపోవడం వారి అసమర్ధ పాలకు నిదర్శమని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాల్ శంకర్ సైతం రైతుల పక్షాన నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రైతు బంధు ఇంకా అందలేదని, పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్!