Lok Sabha Elections 2024: రాష్ట్రంలోని మిగిలిన లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ సీట్లపై చర్చించి అభ్యర్థుల ఫైర్‌ను సీఈసీ ఖరారు చేయనుంది. కాగా.. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నందున.. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గీయులు వెల్లడించారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. పోటీ ఎక్కువగా ఉండడంతో నేడు అధికారులతో చర్చించి పేర్లను ఖరారు చేయనున్నారు.
Read also: Rapido Cab Services: ‘ఓకే చలో’ యాప్ సేవలు.. క్యాబ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం..!
తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించిన విషయం తెలిసిందే.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ మార్పులు చేసినట్లు కాంగ్రెస్ హైకమాండ్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావులను నియమించారు.
Read also: MLC Kavitha: నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ..
హైదరాబాద్ కు ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ సంపత్ కుమార్, చేవెళ్ల వేంనరేందర్ రెడ్డిలను నియమించారు. ఇన్ చార్జిలుగా మల్కాజిగిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండ సురేఖ, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, జహీరాబాద్ దామోదర రాజనర్సింహలను నియమించారు. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభపై సీఈసీ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం ముఖ్యనేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్