Ponguleti Srinivasa Reddy: ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రి గా ఉన్నట్లు అపోహలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు సెటైర్ వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ నాడు ప్రజలను, ఎమ్మెల్యే లను, మంత్రులను కలవలేదన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులుగా మార్చారన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.. దళితులకు భూమి ఇవ్వలేదు,ఇళ్ళు ఇవ్వలేదన్నారు. ఫామ్ హౌస్ లో ఉంటూ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు అపోహలో ఉన్నారని వ్యంగాస్త్రం వేశారు. కళ్ళు తెరిచి, మత్తు తెరుచుకుని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేసామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఏం చేశాడని ఓటు వేయాలి.. ఫోన్లు ట్యాప్ చేశాడని ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. అందరి లక్ష్యం ఒక్కటే.. రాహుల్ గాందీ ని దేశ ప్రధాని చేయటం అన్నారు.
Read also: Leopard at Shamshabad: శంషాబాద్ లో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు
బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల లోనే దేశ పరువు, ప్రతిష్టలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిందన్నారు. రైతుల కోర్కెలను విస్మరించి సుమారు ఎనిమిది వందల మంది రైతులను బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పని మాటలను బీజేపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. మాయమాటలు చెప్పటం,పూటకో దేశానికి తిరగటం,ఖరీదైన బట్టలు మార్చుకోవడం చేస్తున్న మొదికి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మతాలను, కులాలను రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ భారత దేశంలో మూడో సారి ప్రధాని కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. చివరకు రాములవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీకు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. రెండు సార్లు అవకాశం వచ్చినా రాజీవ్ గాంధీ ప్రధాని కాలేదన్నారు. రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను గెలిపించాలన్నారు. ఇందిరమ్మ కుటుంబానికి అందరం అండగా ఉండాలన్నారు.
Read also: Thummala Nageswara Rao: గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతాం..
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రేషన్ కార్డు, పెన్షన్ ఇతర హామీలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 65 ఏళ్ల నుండి రఘురాంరెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. దోచుకోవటం కోసమో, దాచుకోవటం కోసమో రఘురాం రెడ్డి పోటీ చేయటం లేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులను హెచ్చరిస్తున్నాం.. మాట జారేముందు ఆలోచనతో మాట్లాడాలని అన్నారు. కేవలం 13 రోజుల మాత్రమే సమయం ఉంది..కొద్దీ టైం లోనే మరింత కష్టపడాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలా కష్టపడి నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి.. ప్రచారం చేయాలన్నారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుంది..