Ponguleti Srinivas: వీడిన మిస్టరీ.. ఆ పార్టీలోకి పొంగులేటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Ready To Join Congress Party Soon: బీఆర్ఎస్ పార్టీకి దూరమైనప్పటి నుంచి.. మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారు? అనేది అతిపెద్ద మిస్టరీగా మారింది. ఆమధ్య బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారాలు జోరుగా సాగాయి కానీ, చివరికి అందులో వాస్తవం లేదని తేలిపోయింది. మరి, ఆయన పయనం ఎటువైపు? అనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అయితే.. ఇన్ని రోజుల తర్వాత ఈ మిస్టరీకి తెరపడింది. పొంగులేటి ఏ పార్టీలోకి చేరబోతున్నారనే విషయం తేలింది.
Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నా కసితో.. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు ఇతర కార్యక్రమాలతో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి చేరనున్నట్టు వినికిడి. పది రోజుల్లోనే ఆయన ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి, చర్చలు కూడా పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ హాల్లో ఈ చర్చలు సాగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. వారం రోజుల్లోనే పొంగులేటి చేరికపై కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి మంచి రోజులు లేకపోవడంతో.. ఆలోపే, అంటే 16వ తేదీ లోపే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరికపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ వార్తలపై పొంగులేటి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
Gyanvapi Case: జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్.. పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్న రాఖీ సింగ్
కాగా.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ పోటీ చేసి గెలుపొందారు. అంతేకాదు.. జిల్లాలో మూడు ఎమ్మెల్యే స్థానాల్ని కూడా ఆయన గెలిపించారు. అయితే.. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి చేరారు. కానీ.. 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆయనకు ఎంపీ సీటు ఇవ్వలేదు. దీంతో.. పొంగులేటికి సానుభూతి పెరిగింది. ఆయన జిల్లావ్యాప్తంగా తిరగడం, ఈ క్రమంలో బీఆర్ఎస్తో గ్యాప్ రావడం జరిగింది. ఇదే సమయంలో కేసీఆర్ దూరం పెట్టడంతో.. పొంగులేటి ఆయనపై, బీఆర్ఎస్పై అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు. దాంతో పొంగులేటిపై వేటు పడింది. అప్పటి నుంచి తన తదుపరి నిర్ణయంపై సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ వచ్చిన పొంగులేటి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!