Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ టవర్లకు వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వీటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో విడతల వారీగా ఈ భవనాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత కింద నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించడంతో పాటు డీపీఆర్ రూపకల్పన వేగంగా జరుగుతోంది.
నగరంలో ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షల వరకు బడ్జెట్ అంచనా ఉండగా.. జిల్లాల్లో మాత్రం నిర్మాణ ఖర్చు కొంత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో ప్రతి ఫ్లాట్‌కు సుమారు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చు కానుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ అందించే ఇందిరమ్మ ఇళ్ల సబ్సిడీ పోను, లబ్ధిదారులు కేవలం రూ.4 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ప్రభుత్వ, హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలనే ఈ టవర్ల నిర్మాణం కోసం పూర్తిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు జిల్లాల్లో కూడా అమలు చేయనుండటంతో పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల మరింత సులభంగా నెరవేరనుంది. అర్హులైన పేదలందరికీ పారదర్శక పద్ధతిలో ఈ ఫ్లాట్లను కేటాయించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!