Ponguleti Srinivas Reddy : హరీష్‌రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
- అసెంబ్లీ రద్దు డిమాండ్‌పై హరీష్‌రావుకు కౌంటర్
- బీజేపీ-బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని వ్యాఖ్యలు
- వారం రోజుల్లో రైతు భరోసా నిధుల హామీ
- ఇందిరమ్మ ఇళ్ల కోసం 23 స్థలాలు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో అసెంబ్లీ రద్దుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విసిరిన సవాళ్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేందుకు పూర్తి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారని, అలాంటప్పుడు దేనికోసం అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావుకు పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ తప్పడం వల్లే ఇలాంటి అర్థరహితమైన సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక, ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాయని, ప్రతి ఎన్నికలోనూ ప్రజలు బీఆర్ఎస్కు తగిన శిక్ష వేస్తున్నారని గుర్తుచేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు.. కేటీఆర్ విమర్శలపై రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసే వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. కేటీఆర్ చేసే ప్రతి చిన్న విషయానికి తాను ప్రతిసారీ సమాధానం చెప్పనని, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా బదులిస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎవరిపైనా వ్యక్తిగత కక్షలతో వ్యవహరించబోదన్నారు. ఇదే సమయంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ.. రాష్ట్రంలో అధికారం సాధిస్తామంటున్న బీజేపీది కేవలం అత్యాశ మాత్రమేనని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని ఆ పార్టీ, ఇక్కడ ప్రభుత్వం మారుస్తామని కలలు కంటోందని చమత్కరించారు. నిజానికి బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, థర్మల్ పవర్ ప్లాంట్ల భారీ అక్రమాలపై తాము సీబీఐ విచారణ కోరినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పందించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
వారం రోజుల్లో రైతు భరోసా.. ఇందిరమ్మ ఇళ్లకు స్థలాల గుర్తింపు
రాష్ట్ర రైతాంగానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన భరోసా ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ.. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులను పూర్తిగా జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, నిరుపేదల సొంతింటి కల వేగంగా నెరవేర్చేందుకు గానూ మొదటి విడతలో 18 నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 23 అనువైన స్థలాలను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఎలాంటి రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. ఇటీవల సవరించిన భూముల ప్రభుత్వ విలువల (మార్కెట్ ధరల) నిర్ణయంలో ఎక్కడైనా వ్యత్యాసాలు లేదా పొరపాట్లు జరిగినట్లు తమ దృష్టికి వస్తే.. వాటిని పునఃపరిశీలించి తక్షణమే సవరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!