Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephant Death: చిత్తూరు జిల్లా పుంగనూరు, మంగళంపేట అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏనుగులతో కూడిన గుంపులో ఒక మగ ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మంగళంపేట పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ ఏనుగుకు తగలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం మృత ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతికి దారితీసిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఏనుగు మృతిపై పవన్ కల్యాణ్ విచారం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!