Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Health Department: తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి దశకు షార్ట్‌లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగల్‌రావ్‌నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఈ ప్రక్రియ జరగనుంది.
అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన అసలు సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల ఫొటోకాపీలు తీసుకురావాలని MHSRB సూచించింది. ఇక, నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేని అభ్యర్థులు లేదా అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించలేకపోయిన వారి కోసం సెప్టెంబర్ 28వ తేదీని రిజర్వ్ డేగా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. దీంతో 1,931 పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోనుంది.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
రెండున్నరేళ్లలో 15 వేలకు పైగా పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బంది పాత్ర కీలకమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖలో నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండున్నర సంవత్సరాల్లోనే ఆరోగ్యశాఖలో 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సుమారు 2 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకం పూర్తయితే వైద్య, ఆరోగ్య సేవల్లో సిబ్బంది కొరతను కొంతమేర తగ్గించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!