Dog Missing: తప్పిపోయిన పూజారి శునకం.. సీసీ కెమెరాలు శోధించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెంపుడు జంతువులు తప్పిపోతే అల్లాడిపోతారు.. మొదట వాటి జాడ కోసం వెతకడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించడం.. అయిన తర్వాత కొందరు దాని గురించి మర్చిపోతే.. మరికొందరు మాత్రం తమ పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోతారు.. చివరకు పోలీసులను ఆశ్రయించిన సందర్భాలు కూడా అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా హైదరాబాద్‌లో తన పెంపుడు కుక్క పోయిందంటూ ఓ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, శునకం కోసం రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను వెతకడం ప్రారంభించారు.. ఫిర్యాదు దారుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల నుంచి క్రమంగా అది ఎటువైపు వెళ్లిందో.. ఆ రూట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శోధించి చివరకు ఆ శునకాన్ని పట్టుకుని.. దాని యజమానికి అప్పగించారు.
Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు ఆలయం మూత..
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన పెంపుడు కుక్క తప్పిపోయిందంటూ.. శ్రీనివాస్ చార్యులు అనే రామాలయం పంతులు పోలీసులను ఆశ్రయించారు.. తన పెంపుడు కుక్క ల్యాబ్ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ఎక్కడికో వెళ్లిపోయిందని.. తిరిగి ఇంటికి రాలేదని.. మూడు రోజుల పాటు మా కాలనీలో మొత్తం వెతికినా దాని ఆచూకీ దొరకలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలు చెక్ చేయడం మొదలుపెట్టారు.. చివరకు ఆ పెంపుడు కుక్కను అల్వన్ కాలనీలో గుర్తించారు.. దానిని తీసుకొచ్చి.. దాని యజమాని అయిన శ్రీనివాస్ చార్యులకు అప్పగించారు.. మొత్తంగా.. తప్పిపోయిన శునకాన్ని.. సీసీ కెమెరాలు ఇంటికి చేర్చాయి.. కాగా, సీసీ కెమెరాలు ఇప్పుడు వివిధ కేసుల్లో నేరగాలను కూడా పట్టుకోవడానికి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!