Police Allowance: పోలీసులకు ప్రత్యేక అలవెన్స్ రద్దు..? ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకంటూ చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం పలుజిల్లాల్లో పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌లను రద్దు చేసింది. దానికి గల కారణం మావోయిస్టు కార్యకాలాపాలు తగ్గుముఖం పట్టాయనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకుందని టాక్.. అయితే.. గతంలో రాజధాని మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఈ అలవెన్స్ ఉండేది. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉన్న కాలంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్, ప్రత్యే పోలీస్ విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించేది. ఈనేపథ్యంలో.. గతనెల వరకు ఈ అలవెన్స్ ను ఇస్తూ వచ్చి.. ఆతరువాత కొన్ని జిల్లాల్లో మినగా మిగిలిన జిల్లాలకు ఉండబోదని తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు మౌఖికంగా ఠాణాలకు సమాచారం ఇచ్చారు.
read also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
Also Read
అయితే.. మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. కాగా.. కేంద్ర హోంశాఖ ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి భద్రత సంబంధిత వ్యయం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. దీంతో.. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలున్నాయి. అయితే.. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్ ఇస్తూ.. మిగిలిన జిల్లాలకు కోత విధించడం గమనార్హం. కాగా.. ఆ ఎనిమిది జిల్లాల్లోనూ మావోయిస్టు ప్రభావం అంతగా లేని కొన్ని ఠాణాలకు మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పొత్కపల్లి పోలీస్స్టేషన్లకు మాత్రమే అలవెన్స్ వర్తింపజేయడం చర్చనీయాంశానికి దారితీసింది.
పోలీస్ వాట్సప్ గ్రూపుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి పోలీసులకు అలవెన్స్‌ను రద్దు చేయడంతో తెలంగాణలో నక్సల్స్ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్ అలవెన్స్ తొలగించడం మంచిగానే వుంది సార్.. మరి లేని నక్సల్స్ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అఫీసులకు, ఇళ్లకి గార్డులు ఎందుకు ?’ అంటూ సందేశాలు తెలుపుతుండటంతో ఈ వార్త కాస్త వైరల్‌గా మారింది.
Lal Darwaza Bonalu: సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన పీవీ సింధు
తాజావార్తలు
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?