Badulgula Lingaiah Yadav: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డ సమాధి కట్టడం ప్రజలు చేశారని, టీఆర్ఎస్ కాదని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ అన్నారు. మోటార్ల కు మీటర్లు పెట్టాలని చూస్తే విద్యుత్ ఉద్యోగులు తిరగబడే పరిస్తితి వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ లోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ జనగణన చేయమని ఎన్నో సార్లు విన్నవించుకున్నమన్నారు. మునుగోడులో ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ పొంది పార్టీ మారి ఎలక్షన్ తెచ్చాడని ఆరోపించారు. అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డీ అని తెలిపారు. ఎలానూ కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ను గెలిపించాలని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Jumble of revolvers: అసెంబ్లీ సమీపంలో రివాల్వర్ల కలకలం
మోటార్ లకు మీటర్స్ పెడితే తప్పేంటి అంటాడు… బండి సంజయ్ మాత్రం మోటార్ లకు మీటర్లు పెట్టడం లేదు అంటాడు. కేసీఆర్ ఈ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని అన్నాడు. పోయిన సారి బీజేపీ కి డిపాజిట్ దక్క లేదని తెలిపారు. రాజకీయ పార్టీగా ఎన్నికలో గెలవాలని కోరుకుంటామన్నారు. బీజేపీ డబ్బుతో గెలవాలని చూస్తుందని, మొన్ననే బీజేపీ కార్యకర్త కోటి రూపాయలతో దొరికాడని ఎద్దేవ చేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో తినే అన్నాన్ని నోటి కాదా లాక్కుంది బీజేపీ అని ఆరోపించారు. టీఆర్ఎస్ అనేక పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ది చేకూరిందని తెలిపారు. బీజేపీ మాత్రం 400 ఉన్న గ్యాస్ ధరలను 1100 చేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసింది బీజేపీనే అని అన్నారు. మునుగోడులో ఆఖరికి ఎన్నికల కమిషన్ ని కూడా వాడుకుంటుందని ఆరోపించారు. మునుగోడు ప్రజలు కేసీఆర్‌ని గెలిపించాలని ఫిక్స్ అయ్యారన్నారు. మాలాంటి బలహీన వర్గాలకు న్యాయం జరిగింది కేసీఆర్ నాయకత్వం లోనే అని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి బూర నర్సయ్య గౌడ్ ప్రలోభ పెట్టి చేర్చుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టాలని చూస్తుందని తెలిపారు. మోడీ.. కేసీఆర్ కు భయపడుతున్నాడని ఎద్దేవ చేశారు. బండి సంజయ్ ని గానీ బీజేపీ నాయకులను గానీ ప్రజలు పట్టించుకోరని తెలిపారు. బలహీన వర్గాలు అన్నికుడా టీఆర్ ఎస్ ని గెలిపిస్తాయని అన్నారు.
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ రవి చంద్ర మాట్లాడుతూ.. బీజేపీ పెట్టుకున్న కలలు అన్నీ బగ్నం కాబోతున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో విద్యుత్ లేదు, కానీ మన దగ్గర 24 గంటల కరెంట్ ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశప్రజలు కేసీఆర్ ని దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నిక కూడా బీఅర్ఎస్ అనుకూలంగా మారబోతోందని తెలిపారు. గిరిజన రిజర్వేషన్ ని 10శాతం పెంచి న్యాయం చేశారని అన్నారు. దళిత బందు దేశంలో ఎక్కడ లేని స్కీం అని గుర్తు చేశారు.
Bangladesh: వెరైటీ దొంగ.. పోలీసులకే ఫోన్ చేశాడు..ఎందుకంటే..