revolvers near assembly in hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సమీపంలో తుప్పుపట్టిన రివాల్వర్ల కలకలం సృష్టించాయి. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా 3 రివార్వర్లు కనిపించడంతో భాయాందోళకు గురయ్యారు. వెంటనే సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటా హుటిన పోలీసులు అక్కడకు చేరుకుని చెట్ల పొదలలో 1 తపంచ, 2 కంట్రీ మేడ్.. 3 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read also: Dasoju Sravan: బీజేపీకి ఊహించని షాకిచ్చిన దాసోజు.. మళ్లీ కారెక్కుతున్నాడు..
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెస్త్తున్నారు. అక్కడికి ఎవరు వస్తుంటారు? ఎందుకు ఇక్కడ దాచి పెట్టారు? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఇంకా ఏమైనా వున్నాయా అంటూ వెతుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ సమీపంలో ఈ రివార్వర్లు వుండటంతో దుండగులు ఏదో పక్కా ప్రణాళికలు వేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Indian Market: ఇండియన్ మార్కెట్.. ఇంపార్టెంట్. ఈ మాటన్నది ఏ దేశం?