Occult Worship: మంథని హాస్టల్లో దారుణం.. లక్ష్మీదేవి కటాక్షం పేరుతో విద్యార్థులతో నగ్న పూజలు..!
- లక్ష్మీ దేవి కటాక్షం కోసం బాలికను ప్రలోభపెట్టి నగ్న పూజలు..
- పేద విద్యార్థినిలతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న హాస్టల్ వర్కర్..
- వంట మనిషిని అదుపులోకి తీసుకున్న మంథని పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Occult Worship: పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో గల ఓ హస్టల్ లో దారుణం జరిగింది. నగ్న పూజలు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షిస్తుందని ఓ హాస్టల్ వంట మనిషి పేద విద్యార్థులకు ఎర వేసింది. హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకు డబ్బు ఆశ చూపిన ఆమె నగ్న పూజలకు సహకరించాలని కోరినట్లు సమాచారం?.. నగ్న పూజలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షిస్తుందని నమ్మించి, వారం రోజుల క్రితం కొందరు పూజలు చేసే వారిని సదరు వంట మనిషి సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులుగా అక్కడే ఉండి.. సోమవారం తల్లిదండ్రులు రావడంతో వారికి విషయం మొత్తం చెప్పింది.
Read Also: Hyderabad: మూసీ నదిలోకి కెమికల్స్ డంపింగ్.. పోలీసులు అదుపులో నిందితుడు
Also Read
ఇక, బాలిక బంధువులు, తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకోని వంట మనిషిని నిలదీశారు. ఆమెతో వాగ్వాదానికి దిగడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ గొడవపై పోలీసులకు సమాచారం అందడంతో మంథని సీఐ రాజు, ఎస్ఐ రమేష్, హాస్టల్ వద్దకు వెళ్ళి విచారణ చేపట్టారు. అయితే, గత కొంతకాలంగా మంథని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో పేద ఆడ పిల్లలతో వంట మనిషి వ్యభిచారం, నగ్న పూజలు చేయిస్తున్నారని విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆడ పిల్లలను ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకుని మంథని పోలీసుస్టేషన్ కు తరలించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!