Hyderabad: మూసీ నదిలోకి కెమికల్స్ డంపింగ్.. పోలీసులు అదుపులో నిందితుడు
- కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్..
- లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ వద్ద అర్థరాత్రి రెండు ట్యాంకర్లను పట్టుకున్న స్థానికులు..
- వాటర్ ట్యాంకర్ల ముసుగులో రసాయన వ్యర్థాలు..
- బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కెమికల్, ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి రెండు ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం.
Read Also: IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. ఏ జట్టులో ఎవరెవరున్నారో తెలుసా?
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
అయితే, మూసీ కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్ బయల్దేరిన తర్వాత.. ప్రతీ పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ దగ్గర ట్యాంకర్ ను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్, కంపెనీల ఏజెంట్లు.. డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇసుక రిచ్ నిర్వహకుడితో కలిసి తతంగం కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు.. వెనక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా.. మరో ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీలు పెద్ద మాఫియా నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: Pushpa 2 Update: హమ్మయ్య.. ఓ పనైపోయింది! ఫాన్స్ రెడీ అయిపోండమ్మా
రాజేంద్రనగర్ సీఐ మాట్లాడుతూ.. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బాపు ఘాట్ వద్ద మూసీలోకి కెమికల్ వ్యర్థాలు కలిపే సమయంలో పట్టుకున్నారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకుని ట్యాంకర్ ను సీజ్ చేశాం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చాం.. ట్యాంకర్ షాద్ నగర్ పారిశ్రామిక వాడ నుండి వచ్చినట్లు తేలింది.. ట్యాంకర్ లో కెమికల్ వ్యర్ధాలను కలుపుతోంది ఎవరు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరో రెండు లారీలు పరార్ అయ్యాయి.. వాటిని కూడా పట్టుకుంటాం.. మూసీ నదిలోకి కెమికల్ వ్యర్ధాలు వదలడానికి ప్రత్యేకంగా మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మ్యాన్ హోల్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై.. సహకరిస్తున్న ఇసుక రిచ్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ సీఐ క్యాస్ట్రో వెల్లడించారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..