Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Arnab Alert Today In AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపుబలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read
- Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అలాగే పోలవరం, కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మిగతా జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!