పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పారిశ్రామిక వాడలో రోజు రోజుకు హెచ్ ఐవీ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని అక్కడి వైద్యులు తెలిపారు. గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ కు నెలకు వంద సంఖ్యలో రోగుల వస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇందులో ఎక్కువ యువతతో పాటు.. భార్యా, భర్తలు ఉండడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదువేల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు వెల్లడించారు.
Read Also: Garasia Tribe: అక్కడో వింత ఆచారం.. మహిళలు ఎడాదికో వ్యక్తిని మార్చుకోవచ్చు
అయితే .. వివాహేతర సంబంధాలతోపాటు పలు ఇతర కారణాలు వ్యాధి వ్యాప్తిని పెంచుతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సోషల్ మీడియా పరిచయాలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. విచ్చల విడిగా శృంగారం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకరు వాడిన ఇంజక్షన్ ను మరొకరికి వాడడం, హెచ్ఐవీ ఉన్న వారు తెలియక రక్తదానం చేయడంతో కూడా హెచ్ ఐవీ బాధితులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. పరిచయం లేని వ్యక్తులతో కలిసినపుడు తగు జాగ్రత్తలు పాటించాలని.. లేక పోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Also:Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి
నెలనెల హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.. వ్యాధి సోకిన రోగులు నిత్యం తమ దగ్గరికి వస్తుంటారని… కౌన్సెలింగ్ నిర్వహించి వారి మానసిక ఆందోళనను తగ్గిస్తున్నామంటున్నారు. మందులతోపాటు కౌన్సెలింగ్ ద్వారా వారిలో ధైర్యాన్ని నింపవచ్చన్నారు.హెచ్ఐవీ సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని చెబుతున్నారు.