ఈటల లాగే మల్లారెడ్డి పై విచారణ జరపాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళిత గిరిజన బిసీ మైనార్టీ లకు లాభం జరగాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు. అందుకే రేవంత్ రెడ్డి సోనియాను తెలంగాణ తల్లి అంటున్నారు అని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళిత గిరిజనులకు అణచి వెస్తున్నారు. అర్హులైన దళిత గిరిజన అధికారులను ప్రధాన్యత కలిగిన పోస్ట్ లను ఇస్తున్నారు. అగ్రవర్ణాల అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా తిరిగి పోస్ట్ లలో కొనసాగిస్తున్నారు. సీఎం ఆఫీస్ లో పనిచేసే మెజారిటీ ఉన్నత ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులే అని తెలిపారు.
కేసీఆర్ నియంతృత్వ ధోరణి,అణచివేత ధోరణిలోనే అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలి బయటికి వచ్చారు. ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన దళిత గిరిజన ఉద్యోగులను ఇలా అనగా దొక్కడం ఎంత వరకు సమంజసం. బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు.పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. కేసీఆర్ అవలంభిస్తున్న దళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూ నే కాంగ్రెస్ దండోరా కార్యక్రమం. రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన దళితుల భూముల ఎందుకు గుంజుకుంటున్నారు. మూడు చింతల పల్లి లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళే రోడ్డు ఎత్తు పెంచడం ద్వారా దళితుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ గ్రామంలో దళితుల కష్టాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు అని స్పష్టం చేసారు.
Also Read
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
అయితే ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లా రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్లు రేవంత్ పై బూత్ లు మాట్లాడటం సరైందేనా… మల్లారెడ్డి కి చిత్త శుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించాలి. ఈటల రాజేందర్ పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డి పై విచారణ జరిపించాలి. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండేందుకు అర్హుడు కాడు. కేసీఆర్ మల్లారెడ్డి నీ బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మెల్యేలు,మంత్రులు చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. దళిత గిరిజనుల కు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
-
Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!