Pawan Kalyan Varahi Puja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా.. జనసేన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజలు నిర్వహించారు.. కొండగట్టు పర్యటన కోసం ఇవాళ ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు పవన్.. హకీంపేట్ దగ్గర కొద్దిసేపు ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.. ఆ తర్వాత.. కొండగట్టుకు చేరుకున్న జనసేనానికి ఘన స్వాగతం లభించింది.. పవన్‌పై పూల వర్షం కురిపించారు అభిమానులు.. భారీ గజమాలతో ఆయను సత్కరించారు.. జనసేన నేతలు భారీ కాన్వాయ్‌తో ఆయన వెంట వెళ్లారు. పెద్ద సంఖ్యలో బైక్‌లపై తరలివచ్చారు.. కొండగట్టుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.. వారికి అభివాదం చేస్తూ.. అంజన్న ఆలయానికి చేరుకున్నారు పవన్ కల్యాణ్.. ఇక, కొండగట్టు అంజన్న సేవలో అంజనీ పుత్రుడు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు, అభిమానులు..
మరోవైపు.. మధ్యాహ్నం కోడిమ్యాల మండలం పరిధిలోని బృందావన్ రిసార్ట్‌లో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో సమావేశానికి హాజరుకానున్నారు పవన్ కల్యాణ్.. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాచరణపై ముఖ్య నాయకులకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆయన.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు.. ఇక, సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్న పవన్.. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక, పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు..