Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad News: నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. బయట నుంచి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిని తీరు అందరిని కలిచివేదసింది. తమ కొడుకు అనారోగ్యంతో వున్నాడని ఆసుపత్రిలో స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని సహరించాలని కోరినా ఎవరు నోరుమదపలేదని అన్నారు.
దీంతో దిక్కుతోచని స్థితిలో రోగి కాళ్లు పట్టుకుని తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నిజామాబాద్ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఆసుపత్రిలో సరైన వసులులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లి వైద్యులు అందుబాటులో ఎవరూ ఉండని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో వైద్యులు, స్ట్రెచర్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్యాసింజర్ ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మార్చి 31న పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. చిట్టితో ఓపీ వచ్చేలోపు లిఫ్ట్ రావడంతో పేషెంట్‌ను తల్లిదండ్రులు లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్తుకు చేరుకున్న రోగిని వీల్ చైర్ లోనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఏం జరిగిందో తెలియని ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదే జరిగింది కానీ ఇంకేదో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని విరించారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!