నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లుపట్టుకుని తల్లిదండ్రులు వైద్యం కోసం లాక్కొని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. కలెక్టర్, మంత్రి హరీశ్ రావు తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది.