నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్‌లో వాచ్‌మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్‌మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు.
Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. అనంతరం ఈ విషయమై…
Doctors Negligence: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది.
UP Hospital Doctors Refused To Touch HIV+ Woman, She Lost Baby: డాక్టర్ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ప్రవర్తించారు. వైద్యం కోసం వచ్చి హెచ్ఐవీ పాజిటివ్ మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారు. కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. గర్బిణి అనే కనికరం లేకుండా వ్యవహారించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ వైద్యం కోసం సమీపంలోని ఫిరోజాబాద్ ఆస్పత్రికి వెళ్లింది.…
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని రోగులు వాటిని ఆశ్రయిస్తుంటారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్పుకోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన కాన్పు కోసం చేరిన బొంతు సునీత అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కాన్పు కోసం సర్జరీ కిట్ బయట…
ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఓ నవజాత శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యునిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారు కోడిపుంజుల తండా కు చెందిన నిండు గర్భిణీని ప్రసూతి నిమిత్తం తొలుత జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో…
హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం వివాదాస్పదం అయింది. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. నాదర్ గుల్ కి చెందిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుస్తుందని సిబ్బందికి చెప్పగా సిబ్బంది వచ్చి చూసి వెళ్ళారు. కొద్దిసేపటి తరవాత పాప ఏడుపు ఆపి కళ్ళు మూసుకోవడంతో డాక్టర్ లు వచ్చి పాప చనిపోయింది అని చెప్పారు. ముందే…